logo:matrudevobhava_seva_trust

మాతృదేవోభవ సేవా ట్రస్ట్

కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష దైవంతో సమానం. ఈ ప్రధాన నినాదంతో మాతృదేవోభవ సేవా ట్రస్ట్ ఆవిర్భవించినది. కన్నతల్లికి, మాతృభూమికి రుణం తీర్చుకునే ప్రక్రియలో భాగంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్య కొనసాగించలేని ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులను గుర్తించి వారిని గమ్యసాధనలో ప్రోత్సహించి సమాజ ఉద్దరణలో భాగస్వాములను చేయాలనేది సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుత పరిస్థితులలో ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి, వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని పెంపొందించుకొనడానికి అత్యుత్తమ మార్గం ఉన్నత విద్య. ఉన్నత విద్య ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. తద్వారా విద్యార్థుల వ్యక్తిగత భవిష్యత్తు మాత్రమే కాక దేశ భవిష్యత్తు కూడా ప్రజ్వలితమవుతుంది. ఈ భావన ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావింపబడేటట్లు కృషి చేయడం సంస్థ యొక్క ముఖ్య ఆశయం. ప్రతి విద్యార్థిచేత దేశభక్తి, నైతికత, క్రమశిక్షణ ఆచరింప చేయడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి, తమ దేశ ప్రగతికి తోడ్పడేటట్లు చేయాలనేది ప్రతి సభ్యుని యొక్క వ్యక్తిగత మరియు సామూహిక సంకల్పం.

చేపట్టిన కార్యక్రమాల వివరములు:

ది. 25-ఆగస్టు-2025న మాతృదేవోభవ సేవా ట్రస్ట్ ఉపకార వేతన వితరణ సమావేశ దృశ్యములు
వేదిక: శ్రీ సాయిరాధా ఫంక్షన్ హాలు, ఫతేబాద, ఏలూరు.

1 / 22
2 / 22
3 / 22
4 / 22
5 / 22
6 / 22
7 / 22
8 / 22
9 / 22
10 / 22
11 / 22
12 / 22
13 / 22
14 / 22
15 / 22
16 / 22
17 / 22
18 / 22
19 / 22
20 / 22
21 / 22
22 / 22

ది. 25-మే-2025న ఏలూరు ఫతేబాదలోని శ్రీ సాయిరాధా ఫంక్షన్ హాలు నందు జరిగిన మాతృదేవోభవ సేవా ట్రస్ట్ త్రైమాసిక సమావేశ దృశ్యములు

1 / 10
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

జగ్గవరపు ప్రవల్లిక

ది. 07-12-2024న నారాయణ ఐఎఎస్ అకాడమీలో ఐ.ఎ.ఎస్. లక్ష్యంగా బి.ఎ. రెండవ సం.చదువుతున్న చిరంజీవి జగ్గవరపు ప్రవల్లికకు రూ ఎనభై వేల చెక్కును అందిస్తున్న దృశ్యం. కార్యక్రమంలో ఛైర్మన్ శ్రీ కృష్ణ మోహన రావు గారు, సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి శ్రీ భాస్కర రామం, సభ్యులు శ్రీ ఆనంద నాయుడు, శ్రీ హరి నారాయణ, శ్రీమతి నిర్మల, శ్రీ సత్యనారాయణ రాజు, శ్రీ ఎమ్.ఎస్.ఎమ్.ఎస్. కుమార్, శ్రీ మానేపల్లి సత్యనారాయణ, శ్రీమతి సునీత, శ్రీ అత్యం కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.


1 / 6
2 / 6
3 / 6
4 / 6
5 / 6
6 / 6

ది. 07-12-2024న ప్రభుత్వ బాలనేరస్థుల పాఠశాల, శనివారపు పేట విద్యార్థులకు శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం



మా స్పందన:

అంకం శ్రావణ లక్ష్మి

ఉల్లా సాయి సునీత

ఎస్. సాయి కుమార్

నక్కిన సాయిదుర్గా సాహిత్య

ముదికి నందిని

రేవూరి పూజిత

వి శ్వేతా కిరణ్మయి

వి. రోహిణి కుమార్

పరుచూరి లక్ష్మీ తులసి


మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్యదేవోభవ!

సర్వేజనాః సుఖినోభవంతు!


Copyright © Matrudevobhava Seva Trust 23-May-2026